మేషం
మీ సత్తాను నిరూపించుకునే సమయం ఆసన్నమైంది.
ఎవరినీ లెక్కచేయకుండా స్వయంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.
అలాగే, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజవేయరు.
ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.
మీ శక్తియుక్తులను ఉపయోగించి సమస్యల నుంచి గట్టెక్కుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొన్ని విషయాలలో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వచ్చే వీలుంది.
విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.
ఆర్థికం.. కొన్ని బాకీలు అనూహ్యంగా వసూలవుతాయి.
ఆర్థిక లావాదేవీలు ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ ముందుకు సాగుతారు. రుణ విముక్తి లభించే సూచనలున్నాయి.
ఊహించని రీతిలో ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
అలాగే, విలువైన షేర్లలో పెట్టుబడులు పెడతారు.
షేర్ల కొనుగోలులో కొంత ఆలోచించి అడుగువేయండి.
భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.
కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
బంధువులతో సత్సంబంధాలు నెలకొని సంతోషంగా గడుపుతారు.
ఆరోగ్యం గతం కంటే మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు.
కొత్త వ్యాపారాలకు ప్రణాళిక సిద్దం చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
భాగస్వామ్య ఒప్పందాలలో తొందరపాటు మాత్రం వద్దు.
ఉద్యోగాలలో హోదాలు, గౌరవం పెరుగుతాయి. విధులు చక్కదిద్దడంలో రాజీపడడరు.
అధిక చొరవ మాత్రం వద్దు. సాటి సహచరులే మీకు సమస్యగా మారవచ్చు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.
మహిళలకు శుభవార్తా శ్రవణం.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.