మేషం
కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు ఓర్పుగా పరిష్కరించుకుంటారు.
మీ ఆశయాలు నెరవేరేందుకు బంధువుల సహాయం కోరతారు.
రాబడి ఆశాజనకంగా ఉంటుంది.
అయితే అదనపు ఖర్చులు కూడా తప్పకపోవచ్చు.
ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు.
ఆరోగ్యం గతం కంటే మెరుగుపడి ఊరట చెందుతారు.
వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు సఫలం.
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.
కొత్త వ్యక్తుల పరిచయాలు.
దేవాలయాలు సందర్శిస్తారు.
ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.
వ్యాపారులకు లాభాలు అందుతాయి.
ఉద్యోగులు సేవలకు గుర్తింపు పొందుతారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.
వారారంభంలో శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు.