మిథునం
మీ వ్యూహాలు చివరిలో తప్పి నిరాశ చెందుతారు.
కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశకు లోనవుతారు.
ఏ కార్యక్రమం చేపట్టినా ముందడుగు పడక గందరగోళం చెందుతారు.
ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి.
ఇంటాబయటా సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు..
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
తరచూ ప్రయాణాలతో సతమతమవుతారు.
నిరుద్యోగుల ప్రతి ప్రయత్నంలోనూ అవాంతరాలు.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
రుణ దాతలను ఆశ్రయించక తప్పని పరిస్థితి.
ఖర్చులు పరిమితం చేయాలనుకున్నా సాధ్యపడదు.
ఇస్తామన్న వారు కూడా సమయానికి అందకచేయపోవచ్చు.
స్థిరాస్తులు కొన్ని విక్రయించాల్సిన పరిస్థితులు రావచ్చు.
అలాగే వాహనాలు,లేదా భూములు కొనడంలో ప్రతిబంధకాలు.
మీ పై ఒత్తిడులు రావచ్చు. ఏదో ఒక సమస్యతో కుస్తీపడతారు.
మౌనం వహిస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం.
మానసికంగా కొన్ని విషయాల పై బాధపడతారు.
వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలను దక్కించుకుంటారు.
మరో వైపు భాగస్వాములు ఒత్తిడులు పెంచుతారు.
తొందరపడి కొత్త వ్యాపార ఆలోచనలు చేయవద్దు. రిస్క్ తప్పదు.
ఉద్యోగాలలో మరింత అప్రమత్తత, బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది.
అనుక్షణం మిమ్మల్ని గమనించే వారు పెరుగుతారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.
విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటే మేలు.
ప్రస్తుతం ప్రతికూలత ఉన్నందున తొందరవద్దు.
మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు.
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించండి.