సింహం...
-----
కుటుంబసభ్యులతో అభిప్రాయబేధాలు నెలకొనవచ్చు.
కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి.
నిరుద్యోగులకు అందిన అవకాశాలే చేజారవచ్చు.
ధార్మిక కార్యక్రమాలపై మరింత ఆసక్తి చూపుతారు.
తొందరపాటు నిర్ణయాలతో బంధువులు మీపై అలకవహిస్తారు.
వివాహయత్నాలు నత్తనడకన సాగుతాయి.
వ్యాపారులు లాభాలపై సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంటుంది.
ఉద్యోగులకు విధులు కొంత భారంగా మారవచ్చు.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వివాదాలలో చిక్కుకుంటారు.
విద్యార్థులపై ఒత్తిడులు ఉండవచ్చు.
మహిళలు నేర్పుగా వ్యవహరించడం ఉత్తమం.
అనుకూలం....... ఎరుపు, గులాబీ.ప్రతికూలం.. ఆకుపచ్చ.
విష్ణుధ్యానం చేయండి.