సింహం
వ్యయప్రయాసలు మనోనిబ్బరంతో అధిగమిస్తారు.
ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం విరమించండి.
చిక్కులను తేలిగ్గా పరిష్కరించుకునే మార్గాలు అన్వేషించండి.
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడుతూ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు.
సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కారం.
మాట పై నిలబడే తత్వం చూసి అందరూ ఆశ్చర్యపడతారు.
ఒక కుటుంబ సభ్యుని ఆరోగ్యం పై కొంత ఆదుర్దా చెందుతారు.
ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు.
మీరు ఊహించిన దానికంటే తక్కువగా ధనం లభించినా ఖర్చులు అదుపు చేసి నిలబడతారు.
వాహనాలు, స్థలాల కొనుగోలు యత్నాలు సఫలం.
అలాగే, షేర్ల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.
నరాలకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడతారు.
వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా పొందుతారు.
మీ లక్ష్యాన్ని సాధించేందుకు చేరువలో ఉంటారు.
భాగస్వాములపై అతిగా విశ్వాసం వద్దు. పరిమితంగా మసలుకోండి.
ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి.
మహిళలకు ధనప్రాప్తి.
శ్రీ రామస్తోత్రాలు పఠించండి.