సింహం
ఆదాయం కొంత అసంతృప్తినిస్తుంది.
అయినా ఖర్చులకు లోటు రాదు.
దూర ప్రయాణాలు చేస్తారు.
ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బందిపడవచ్చు.
కుటుంబ సభ్యులతో అభిప్రాయాలతో విభేదిస్తారు.
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుకుంటారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి.
వ్యాపారాలు సాదాసీదాగా సాగినా లాభాలు అందుతాయి.
ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి కొంత ప్రోత్సాహకరమైన సమయం.
క్రీడాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు.
వారం మధ్యలో విందులు వినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆస్తిలాభం..