తుల
మీ వ్యూహాలను అనుసరించి సమస్యలు సృష్టించాలనుకున్న వారి అంచనాలు తారుమారు చేస్తారు.
కొత్త వ్యవహారాలు చేపట్టి మరింత వేగంగా పూర్తి చేస్తారు.
మీరు సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో రాజీపడరు.
పట్టుదల, ఓర్పుతో అడుగులు వేస్తారు.
ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
విద్యార్థుల ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందుతుంది..
చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు.
ఒక ఆలోచనకు కార్యరూపం ఇస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.
ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి.
ఇతరులు బాకీబడ్డ మొత్తాలు సైతం అందవచ్చు.
అలాగే, మీరు చేసిన అప్పులు కూడా తీరే మార్గం కలుగుతుంది.
ఆర్థికంగా హామీలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇళ్లు, వాహనాలు కొనుగోలుకు అవకాశాలున్నాయి.
పెద్దల నుండి రావలసిన ఆస్తిపై ఒక వార్త రావచ్చు.
మీ మాటంటే అందరూ గౌరవిస్తారు.
బంధువులు రావడంతో వారితో కొన్ని విషయాలపై చర్చిస్తారు.
వివాహ యత్నాల పై నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగించినా క్రమేపీ సర్దుకుంటాయి.
వ్యాపారాలు లాభసాటిగా నడుస్తూ, మరింత ఊపందుకుంటాయి.
కొత్త భాగస్వాములు జత కడతారు..
ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు. సహచరుల సహాయం స్వీకరిస్తారు.
వైద్యులు, పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన కాలం.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
శివానంద లహరి పారాయణ చేయండి.