మీనం...
------
మీ శక్తియుక్తులకు సన్నిహితులు సైతం ఆశ్చర్యపడతారు.
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలకు లోటురాదు.
వివాహయత్నాలను మరింత ముమ్మరం చేస్తారు.
బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు.
వ్యాపారులు తగినంతగా లాభపడతారు.
ఉద్యోగుల సేవలు మరింత విస్తృతం కావచ్చు.
పారిశ్రామిక,రాజకీయవేత్తలు స్వయంకృషితో ముందడుగు వేస్తారు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలపై దృష్టి సారిస్తారు.
మహిళలు కుటుంబసమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు.
అనుకూలం.... బంగారు, ఎరుపు.ప్రతికూలం...నీలం.
విష్ణుధ్యానం చేయండి.