మీనం
చీటికీమాటికీ ఎదురవుతున్న ఆటంకాలు పట్టుదలతో అధిగమించి ముఖ్య కార్యాలు పూర్తి చేస్తారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు.
స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో మీ చొరవను అందరూ ప్రశంసిస్తారు.
విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు.
రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి.
కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు.
దూరపు బంధువులు రాకతో సంతోషంగా గడుపుతారు.
వాహన సౌఖ్యం.
గతంలో చేజారిన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు తిరిగి లభ్యం కావచ్చు.
వ్యాపారస్తులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు.
ఉధ్యోగులకు కీలక సమాచారం అందుతుంది.
రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు.