ధనుస్సు..
----
పరిచయాలు విస్తృతమై ఉత్సాహంగా గడుపుతారు.
ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి.
ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు.
రాబడి అనూహ్యంగా పెరగడం ఆశ్చర్యమేస్తుంది.
నేర్పుగా కొన్ని కష్టనష్టాల నుండి బయటపడతారు.
ధార్మికచింతనతో మనశ్శాంతి పొందుతారు.
మీ నిర్ణయాలతో అందరూ ఏకీభవిస్తారు.
వ్యాపారాలు సమృద్ధిగా లాభపడతారు. పెట్టుబడులు సమయానికి అందుతాయి.
ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.
చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు అన్ని విధాలా సానుకూలమైన సమయం.
విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు.
మహిళలకు కొద్దిపాటి ఆస్తిలాభం కలుగుతుంది.
అనుకూలం...... నీలం, పసుపు.ప్రతికూలం...గులాబీ.
సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే సర్వదా శుభదాయకం.