ధనుస్సు
మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురై చికాకు పర్చినా లెక్కచేయరు. అడుగులు ముందుకు వేస్తారు.
మీ మనస్సు చెప్పినట్లే నడుచుకుంటారు. ఎవరి సలహాలు అంతగా పట్టించుకోరు.
ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.
సేవాకార్యక్రమాలు చేపడతారు.
పరిచయాలు మరింత పెరిగి ఉపయోగిస్తాయి..
విద్యార్థులకు కీలక సమాచారం ఊరటనిస్తుంది.
ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు.
ఆర్థికంగా క్రమేపీ బలం చేకూరుతుంది.
ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడే అవసరం ఉండదు.
రావలసిన బాకీలు కూడా అందుతాయి.
కుటుంబం పై పెట్టిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పెద్దల ప్రశంసలు పొందుతారు.
కుటుంబంలో ఒక కీలక నిర్ణయం తీసుకుని పెద్ద సమస్య నుండి బయటపడతారు.
ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి.
స్థిరచరాస్తులు.. ఇంటి నిర్మాణయత్నాలలో వేగం పెరుగుతుంది.
అలాగే, కార్లు, బైక్‌లు కొనుగోలు చేస్తారు.
వ్యాపారస్తులు ఉత్సాహంగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.
ఇతర వ్యాపారుల కంటే మెరుగైన లాభాలు పొందుతారు.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఉత్సాహంగా సాగుతుంది.
వీరి పట్టుదలకు ఇతరులు సైతం ఆశ్చరపోతారు.
విధుల్లో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోండి. అప్రమత్తత పాటించండి.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, వైద్యులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు.
మహిళలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
ఋణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి.