ధనుస్సు
ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు మరింత సహకరిస్తారు.
వివాహ, ఉద్యోగ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు.
ప్రయాణాలలో కొత్త పరిచయాలు.
పెద్దల సలహాలు స్వీకరిస్తారు.
ఆదాయం ఆశించినంతగా ఉండి రుణబాధలు తొలగుతాయి.
ఆరోగ్యపరంగా నెలకొన్న సమస్యలు తీరతాయి.
యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.
వాహన యోగం. కుటుంబ విషయాల పై మరింత దృష్టి సారిస్తారు.
ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు.
ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు మరింత అనుకూలమైన కాలం.
వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు. ఖర్చులు పెరుగుతాయి.