వృషభం
ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తిరుగుండదు.
వాటిని పూర్తి చేయడంలో తెలివిని ఉపయోగిస్తారు.
ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఊహించని పిలుపు, లేదా ఫోన్ కాల్‌రావచ్చు.
ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగి ఒక నిర్ణయానికి వస్తారు.
చాకచక్యంగా ముందుకు సాగుతూ ఇతరులను మెప్పిస్తూ వ్యవహారాలు కొలిక్కి తెస్తారు.
ఎటువంటి పొగడ్తలకు పొంగిపోకుండా మీ లక్ష్యాల సాధనలో నిమగ్నమవుతారు.
ఆలయాలు సందర్శిస్తారు.
ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి.
సమాజంలో మీపై ఉన్న ప్రతికూలత తొలగుతుంది.
ఎదురుచూడని విధంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతం నుండి పడుతున్న అవస్థలు తీరతాయి.
ఖర్చుల విషయంలో తొందరపాటు వద్దు. నిదానం పాటించడం ఉత్తమం.
భూవ్యవహారాలలో చిక్కులు వీడి ఉపశమనం పొందుతారు.
షేర్లకు సంబంధించిన లేదా పొదుపు పధకాలలో పెట్టుబడులకు సిద్ధపడతారు.
మీ పై పెద్దలు పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారు.
దూరపు బంధువుల నుండి పిలుపు అందుకుంటారు.
కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు.
తగిన సమయంలో వైద్యం పొందండి.
వ్యాపారాలు మరింత వృద్ధిబాటలో నడుస్తాయి.
అనూహ్యమైన రీతిలో పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురించి మరింత హుషారుగా పనిచేస్తారు.
పై స్థాయి అధికారుల మెప్పుని పొందుతారు.
రాజకీయ, పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు.
వీరికి చేజారిన కొన్ని అవకాశాలు దక్కవచ్చు.
ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. అప్రమత్తత అవసరం.
మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి.
సూర్యాష్టకం పఠించండి.