వృషభం
చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి.
ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం.
శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.
రాబడి గతం కంటే మెరుగ్గా ఉండి అప్పులు తీరుస్తారు.
సమాజసేవలో పాల్గొంటారు.
మీకు నచ్చిందే తప్పితే ఎదుటివారు ఎంత చెప్పినా పట్టించుకోరు.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.
వ్యాపారులు విస్తరణ చర్యలు చేపట్టి విజయం సాధిస్తారు.
ఉద్యోగులకు మరిన్ని హోదాలు దక్కే ఛాన్స్.
రాజకీయవేత్తలు, క్రీడాకారులు, రచయితలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
వారం మధ్యలో వృథా ఖర్చులు.
స్వల్ప శారీరక రుగ్మతలు.