కన్య...
------
రావలసిన కొన్ని బాకీలు అందుకుంటారు.
శత్రువులు కూడా మీపై విద్వేషాన్ని వీడతారు.
కుటుంబంలో కొన్ని వేడుకలకు సన్నాహాలు చేస్తారు.
వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపార విస్తరణలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగులు విధుల్లో తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు.
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి.
విద్యార్థులు ప్రతిభకు మరింత పదును పెడతారు.
మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి.
అనుకూలం....... నీలం, గులాబీ. ప్రతికూలం...నేరేడు.
శివస్తోత్రాలు పఠించండి.