కన్య
మిత్రుల నుంచి అందిన సమాచారం ఎంతో సహాయకారిగా ఉంటుంది.
తెలివిని ఉపయోగించి కొన్ని సమస్యల బారి నుండి గట్టెక్కుతారు.
అనుకున్న కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తారు.
సమాజంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు.
వివాహాది శుభకార్యాలలో సందడిగా గడుపుతారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహాయపడతారు.
విద్యార్థులు కష్టానికి ఫలితం దక్కించుకుంటారు.
కాంట్రాక్టర్లకు మరింత అనుకూల పరిస్థితులు.
ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయం.
కొంతమంది నుండి బాకీలు వసూలై అవసరాలకు ఉపయోగిస్తుంది.
అప్పులు చేసే విషయంలో తొందరపాటు వద్దు.
సోదరులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తారు.
అలాగే, పెద్దల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.
ఎప్పుడో చూసిన బంధువు ఒకరు రావచ్చు.
ఆరోగ్యం క్రమేపీ కుదుటపడుతుంది. అయితే ఆహారవిహారాదుల పై పరిమితులు అవసరం.
స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. ఒప్పందాలలోనూ వేగం పెంచుతారు.
పత్రాల పరిశీలనలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. చిక్కులు ఎదురవుతాయి.
వ్యాపారాలు మరింత వేగవంతంగా కాగలవు.
భాగస్వాముల సహాయసహకారాలు సంపూర్ణంగా అందుతాయి.
ఉద్యోగాలలో మీ బాధ్యతలు నెరవేర్చడంలో రాజీపడబోరు.
ఉన్నతాధికారులు మీ పనివిధానం చూసి ప్రశంసిస్తారు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
మహిళలకు అంచనాలు నిజమయ్యే సమయం.
గణేశాష్టకం పఠించండి.