కన్య
మీ అంచనాలు నిజం చేసుకుంటారు.
ఆత్మీయులు, బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు.
నూతన విద్యావకాశాలు దక్కి సంతోషంగా గడుపుతారు.
చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి.
ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు.
ఆస్తుల ఒప్పందాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు.
ఇంటి నిర్మాణాలపై తుది ప్రణాళిక రూపొందిస్తారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.
వ్యాపారులు లాభాల బాటలో పయిస్తారు.
ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అవార్డులు దక్కుతాయి.
వారాంతంలో శారీరక రుగ్మతలు. ఖర్చులు తప్పవు.