పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత

31st October 2017 5:43am

క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత 

 కృతయుగం లో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక "చిలుక ద్వాదశి" అని కూడా అంటారు. దీన్నె “యోగీశ్వర ద్వాదశి”, “హరిబోధినీ ద్వాదశి”  "బృందవాన ద్వాదశి" అని పిలుస్తారు.  శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి కోట లో శ్రీ మహావిష్ణువు ప్రతిమని ఉంచి ఆచరించే వ్రతం వలన ఐదోతనం ప్రాప్తించి సుఖసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.

ఈ రోజు చేసే సంతర్పణలు, పారాయణల వల్ల బ్రాహ్మణ సమారాధన వల్ల అనంత పుణ్యం లభిస్తుంది. సూర్యగ్రహణ సమయాన గంగా తీరాన కోటిమంది బ్రాహ్మణులకు అన్నసమరాధన చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కార్తిక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది .ద్వాదశి రోజు ఏ దానం చేసినా జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి.

ఏకాదశినాడు రాత్రి ఒక జాము ఉండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు క్షీరసముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్ల దీనికి 'హరిబోదని ద్వాదశి' అనే పేరు వచ్చింది . అటువంటి హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రహ్మనునికైన అన్నదానం చేస్తే విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు.

ఎవరైతే ద్వాదశినాడు పాలిచ్చే ఆవును , వెండి డెక్కలు , బంగారం కొమ్ములతో అలంకరించి , పూజించి , దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో , అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు .

రోజు వస్త్రదానం చేసినవాళ్ళు వైకుంఠన్ని చేరుతారు. సాలగ్రామాన్ని , బంగారపు తులసీ వృక్షాన్ని దక్షణాసమేతంగా దానం చేస్తారో వాళ్ళు - చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. దేవాలయాల్లో దీపాలు వెలిగించడమే కాకుండా ఇతరులు వెలిగించిన వాటిని ఆరిపోకుండా చూస్తే సకల పాపాలు తొలగి పోతాయి.

 

Also Read