పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

సంపూర్ణ చంద్ర గ్రహణం (జనవరి 31, 2018)

26th January 2018 4:50am

సంపూర్ణ చంద్ర గ్రహణం

31-01-2018 బుధవారం మాఘపౌర్ణమి గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం (రాహు గ్రస్తం)

స్పర్శకాలం సాయంత్రం గం. 5. 18 ని.లకు అయితే చంద్రోదయానంతరమే గ్రహణం కనిపించును. సాయంత్రం గం. 5. 53 ల నుండి గ్రహణ చంద్రబింబ దర్శనం నిమీలన కాలం సాయంత్రం గం. 6.21 ని.లకు. గ్రహణ మధ్య కాలం రాత్రి. గం.6.59 ని. లకు. ఉన్మిలన కాలం రాత్రి గం.7.37 ని.లకు. మోక్ష ఆలం రాత్రి గం.8.41 ని. లకు. ఆద్యంత పుణ్య కాలం గం. 2.48 ని.లు.

రాహుగ్రస్త చంద్రగ్రహణం, గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం. పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారు, కర్కాటకం, సింహం, దనుస్సు రాశుల వారు పరిహారాలు చేయించుకోవడం మంచిది.

గ్రహణ సమయం పుణ్య కాలమని పురాణాలు , ధర్మ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పంచాంగం ద్వారా గ్రహణ స్పర్శ మోక్ష కాలాలు తెలుసుకుని స్నానం చేయాలి. గ్రహణ స్నానాన్ని కట్టుకున్న వస్త్రాల తోనే చేయాలి.

గ్రహణ కాలం లో చేసే జపం, దానం, హోమం, మొదలయినవన్నీ అధిక ఫలితాలనిస్తాయి, కావున వీలైనంత వరకు ఆయా పుణ్య కార్యాలను  యథాశక్తి గా ఆచరించాలి.

గ్రహణం విడువగానే పుణ్య నదులు, సరోవరాలు, కాలువలు, బావులు, లేదా కనీసం ఇంట్లోనైనా స్నానం చేయడం వల్ల శారీరిక మానసిక మలినాలు తొలగి పోయి మంచి భావనలు కలుగుతాయి.

గ్రహణాన్ని ఎవరు కూడా నేరుగా కంటి తో చూడకూడదు. ఇంట్లో నిల్వ ఉంచి ఉపయోగించే ఆహార పదార్దాల పైన దర్భలు ఉంచాలి. అప్పుడు అవి పరిశుద్ద మవుతాయి.

ముఖ్యం గా గర్భిణి స్త్రీలు గ్రహణ కాలం లో బయటకు రాకూడదు, గ్రహణ సమయం లో వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం వల్ల గర్భస్త శిశువు మానసిక శారీరిక వైకల్యాలతో జన్మించే ప్రమాదం ఉంది. గ్రహణ సమయం లో ఇష్ట దైవానికి  సంబంధించిన స్తోత్రాలను లేదా నామ జపాన్ని చేయడం విశేష ఫలదాయకం. మిగిలిన వారు కూడా గ్రహణ సమయం లో వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు

 

Also Read