పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

గోరింటాకు ని ప్రత్యేకంగా ఆషాడం లో ఎందుకు పెట్టుకొంటారు

14th July 2018 5:08am

గోరింటాకు ని ప్రత్యేకంగా ఆషాడం లో ఎందుకు పెట్టుకొంటారు?

సంసృతంలో గోరింట చెట్టును ‘మేంధికా' అంటారు. ఆ పదం నుండే మెహిందీ అనే పదం వచ్చింది. ప్రాచీన కాలం నుండి సౌందర్య మరియు ఆరోగ్య సంరక్షణ సాధానాలలో గోరింటాకు ది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే.

 గ్రీష్మ ఋతువు పూర్తయ్యి వర్ష ఋతువు మొదలయ్యే సమయం లో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది, అంతవరకూ వేడిని తట్టుకొన్న శరీరం ఒక్కసారిగా వాతావరణం లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వలన అనారోగ్యాలు తలెత్తుతాయి. గోరింటాకుకు వేడిని తగ్గించే గుణం ఉండడం వలన, బయట వాతావరణానికి అనుగుణం గా శరీరాన్ని చల్లబరిచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా  కాపాడుతుంది. వర్షా కాలం లో సహజం గా కాళ్ళు చేతులు తడవకుండా పనులు జరగవు, ఇలా కాళ్ళు చేతులు నాని చర్మ వ్యాధులు, గోళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గోరింట లో ఉండే ఔషధ గుణం వలన ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి గోరింటాకు ని పెట్టుకొంటారు. అంతే కాకుండా వీటి వల్ల అండాశయాల పనితీరు సక్రమంగా ఉండి సంతానోత్పత్తి అవకాశాలు పెరగడం తో పాటు, రోగ నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది.

ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక గా చెప్పబడింది. మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందుతారాని పెద్దలు చెబుతారు. అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటాకును ప్రతీకగా అరబ్ దేశాలలో ఐదువేల ఏళ్ళ క్రితమే వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మధ్య కాలం లో కృత్రిమ పదార్ధాలతో తయారు చేసిన గోరింటాకును  విరివిగా వాడడం వలన కీడు జరిగే ప్రమాదం అధికం గా ఉంది కావున వీలైనంత వరకు సహజ సిద్దమైన గోరింటను వాడడం వలన శుభఫలితాలతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read