ద్వాదశ రాశుల వారి పై చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది

26th July 2018 5:02am

 

చంద్ర గ్రహణం జులై 27 2018 ద్వాదశ రాశుల పై ప్రభావం

మేషం - ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ లో పరిస్థితులు మెరుగు పడతాయి, సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కొన్ని సమస్యల నుండి ఉపశమనం పొందినప్పటికీ వృత్తి రీత్యా ఒత్తిడి, శ్రమ అధిక ఉంటుంది. చిన్న పని కి సైతం ఎక్కువ శ్రమించవలసి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయం లో కూడా శ్రద్ద వహించాలి, అనారోగ్య సమస్యలు తెలెత్తే అవకాశం కలదు

వృషభం - ఈ రాశి వారికి అన్ని విధాలా జాగ్రత్త గా ఉండవలసిన సమయం, ఎదో ఒక విషయం గా ఆందోళన చెందుతారు. భార్యభర్తల మధ్య సఖ్యత మెరుగుపడుతుంది. ఆరోగ్యం మరియు ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడతాయి. అనవసరమైన వివాదాలకు దూరం గా ఉండడం మంచిది

మిథునం - ఈ రాశి వారి కి సామాన్య స్థితులు నెలకొంటాయి. విరోధులు బాధ కొంత వరకు తగ్గుతుంది. ఆకస్మిక ధన లాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయి లో పెరుగుతాయి. కాబట్టి కొద్దీ గా ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నాలు చేయాలి. వృత్తిరీత్యా ఎదుగుదలకి  అవకాశం కలదు.

కర్కాటక రాశి - ఈ రాశి వారి కి, వ్యవసాయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వ్యాపారం లో చక్కటి లాభాలు అందుకొంటారు. కాక పోతే అన్ని విషయాలలో ను మాటను అదుపులో ఉంచుకొని మాట్లాడడం మంచిది,  కొద్దిగా నోరు జారినా అనవసరమైన సమస్యలు ఎదురుకోవలసి ఉంటుంది. కోపతాపాలకు ఎంత దూరం గా ఉంటే అంత మంచిది

సింహం - ఈ రాశివారి కి చంద్ర గ్రహ ప్రభావం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్య విషయం లో శ్రద్ద వహించాలి. సంఘం లో గౌరమర్యాదలు పెరుగుతాయి వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అధిక బాధ్యతలు ఇవ్వబడతాయి. కొత్త ప్రాజెక్టులకి అవకాశం కలదు.  డబ్బు ఇతరులకి ఇచ్చేటప్పుడు, లేదా ఇతరుల నుండి తీసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి

కన్య -ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వలన చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందుతారు. ఆర్ధిక స్థితి మెరుగు పడుతుంది, గతం లో ఆర్ధిక సమస్యల వలన ఏ వైతే పనులు చేయలేకపోయారో వాటిని తిరిగి చేయడానికి అవకాశముంది. సమాజం లో చక్కటి ఆదరాభిమానాలు దక్కుతాయి. అన్ని పనులు కూడా అనుకొన్న విధం గా పూర్తి చేయగలుగుతారు.

తుల - ఈ రాశి వారికి చంద్ర గ్రహణ ప్రభావం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన కార్యాలన్నీ కూడా ఉత్సాహం గా పూర్తి చేస్తారు. వృత్తి పరం గా చక్కటి పేరు ప్రతిష్ఠలు సంపాదించగలుగుతారు. వ్యవసాయదారులకు కూడా చక్కటి సమయం గా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు అన్ని పనులలో విజయాలు దక్కుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి.

వృశ్చికం - ఈ రాశి వారికి చంద్ర గ్రహణ ప్రభావం వలన అన్ని విధాలా బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి ఇష్టమైన వారితో చక్కటి సమయం గడుపుతారు. వ్యాపారాలని విస్తరించే ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయదారులకు కూడా కలసి వస్తుంది. శుభ వార్తలు అందుకొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది

ధనుస్సు - ఈ రాశి వారికి చంద్ర గ్రహణ ప్రభావం సామాన్య ఫలితాలని కలుగజేస్తుంది. వృత్తి రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించాలి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి ముందు అన్ని విధాలా దాని గురించి క్షుణ్ణం గా పరిశీలించిన తర్వాతనే ముందడుగు వేయాలి. ఇతరుల మాటల వలన ప్రభావితులు కాకుండా ఉండడం మంచిది.

మకరం - ఈ రాశి వారికి చంద్ర గ్రహణ ప్రభావం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన కార్యాలు పూర్తి చేయగలుగుతారు. రుణాలు తీర్చగలుగుతారు. అర్హత గల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం తో తలపెట్టిన కార్యాలు అన్నీ కూడా అనుకొన్న సమయం కంటే ముందే పూర్తి చేయగలుగుతారు. అనవసరమైన  ఆందోళనల కి , వాగ్వివాదాలకు దూరం గా ఉండడం మంచిది.

కుంభం- ఈ రాశి వారికి చంద్ర గ్రహణ ప్రభావం వలన సామాన్య ఫలితాలు కలుగుతాయి. కొంతకాలం గా చేతి కి రాకుండా నిలిచి పోయిన డబ్బు చేతికందే అవకాశం కలదు. ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ అనవసరమైన వాగ్వివాదాలకు దూరం గా ఉండడం మంచిది. ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

 మీనం - ఈ రాశి వారికి చంద్ర గ్రహణ ప్రభావం మంచి ఫలితాలని కలుగజేస్తుంది. వృత్తిరీత్యా చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరీసోదరుల మధ్య చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. కొంతకాలం గా మానసిక వేదన కి గురిచేస్తున్న సమస్య తీరి ఉపశమనం పొందుతారు. కొత్త గా ఏదైనా పనులు ప్రారంభించాలనుకొనే వారు వారి ఆలోచనలని అమలు లో పెట్టవచ్చు. విదేశీ వ్యవహారాలలో/వ్యాపారాలలో చక్కటి లాభాలు ఉంటాయి.

పరిహారాలు –

అన్ని రాశుల వారు కూడా పక్క రోజు యథా శక్తి శివుని కి విశేష పూజలు మరియు తెల్లటి వస్త్రాలు, నెయ్యి, పాలు, చక్కర, కర్పూరం వంటివి దానం చేయడం వలన అశుభ ఫలితాల ప్రభావం తగ్గుతుంది.

Also Read