వైశాఖ మాసం విశిష్టత

24th April 2020 2:48am

వైశాఖ మాసం విశిష్టత:

 వైశాఖ  మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసం గా పురాణాలలో చెప్పబడింది.  శ్రీ మహా విష్ణువు కు  ప్రీతి కరమైన వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.

ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో, వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో  రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

వైశాఖం లో జలదానం ఎంతో పుణ్యమిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే  పుణ్య ఫలం ఒక్క  జల దానం వలన వస్తుందని చెప్పబడిందిఅందుకే ప్రతి చోటా చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తున్నదే. ఈ చలివేంద్రాలు పితరులకు, దేవతలకు, మనుష్యులకు, అందరికీ ఇష్టమైనదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తృప్తిపరుస్తుంది. పూర్వికులంత పుణ్య లోకాన్ని పొందుతారు   నీటిని దక్షిణ తో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది.

కాలంలో లభించే మామిడి పళ్ళ దానం వలన,  ఇచ్చిన వారి పితృ దేవతలు సంతోషిస్తారు, వారి కి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

పానకం నిండిన కుండను దానం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితరులు తరిస్తారు.

దోసపండు, బెల్లం చెఱుకు గడలు దానం వలన వారి సమస్త పాపాలు తొలగుతాయి.

శయన దానం వలన సుఖ సంతోషాభివృద్ది.

వస్త్ర దానం వలన ఆయు వృద్ది. ముఖ్యం గా తెల్లని వస్త్రాన్ని దానం ఇస్తే, పూర్ణ ఆయుర్దాయం పొంది ముక్తి ని పొందుతారు. బీదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగ బాధల నుండి విముక్తి కలుగుతుంది.

కుంకుమ దానం వలన జీవితం లో ఉన్నత స్థాయి కి చేరడానికి, భర్త కి దీర్ఘాయువు కలుగుతాయి

చందన దానం వలన తరచూ ఆక్సిడెంట్ కి గురికారు

తాంబూలం  దానం వలన అధిపతి అవుతారని శాస్త్ర వచనం.

నారికేళం దానం వలన ఏడు తరాల పితృదేవతలు నరకబాధల నుండి విముక్తి పొందుతారు

మజ్జిగ దానం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది.

పాదరక్షలు దానం వలన నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది.

గొడుగు దానం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, వారికి మృత్యు బాధ ఉండదని చెప్పబడింది . సమస్త దోషాలు నివారణ అవుతాయి.

పండ్ల దానం వలన జీవితం లో ఉన్నత స్థాయి కి చేరుతారు.

బియ్యం దానం వలన అపమృత్యు దోషాలు తొలగుతాయి. అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం లభిస్తుంది.

ఆవు నెయ్యి దానం వలన అశ్వమేథ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. విష్ణు సాయుజ్యం లభిస్తుంది

పితృ దేవతలకు తర్పణాలు వదిలినవారికి దారిద్ర్య బాధ ఉండదు.

అన్న దానం విశేష ఫలితాన్నిస్తుంది. వెంటనే తృప్తి ని ఇచ్చే దాన్నలన్నింటి లో ఉత్తమమైనది అన్న దానం. సమస్త దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అన్ని ధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది .

పెరుగు అన్నం దానం వలన వారు చేసిన కర్మలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది.

Also Read