వైశాఖ మాసం విశిష్టత.

4th May 2019 1:21pm

వైశాఖ మాసం విశిష్టత.

 వైశాఖ  మాసానికి మరో పేరు మాధవ మాసంమాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనదివిశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసం గా పురాణాలలో చెప్పబడింది.  శ్రీ మహా విష్ణువు కు  ప్రీతి కరమైన  వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం మాసం లో ఏక భుక్తంనక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడిందివైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకుతపస్సులకు పూజాదికాలకుదాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.

ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారోవారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో  రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.

వైశాఖం లో జలదానం ఎంతో పుణ్యమిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే  పుణ్య ఫలం ఒక్క  జల దానం వలన వస్తుందని చెప్పబడింది.  అందుకే ప్రతి చోటా చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తున్నదే. ఈ చలివేంద్రాలు పితరులకుదేవతలకుమనుష్యులకుఅందరికీ ఇష్టమైనదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తృప్తిపరుస్తుంది. పూర్వికులంత పుణ్య లోకాన్ని పొందుతారు   నీటిని దక్షిణ తో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది.

 కాలంలో లభించే మామిడి పళ్ళ దానం వలన ఇచ్చిన వారి పితృ దేవతలు సంతోషిస్తారువారి కి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.

పానకం నిండిన కుండను దానం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితరులు తరిస్తారు.

దోసపండుబెల్లం చెఱుకు గడలు దానం వలన వారి సమస్త పాపాలు తొలగుతాయి.

శయన దానం వలన సుఖ సంతోషాభివృద్ది.

వస్త్ర దానం వలన ఆయు వృద్ది. ముఖ్యం గా తెల్లని వస్త్రాన్ని దానం ఇస్తేపూర్ణ ఆయుర్దాయం పొంది ముక్తి ని పొందుతారుబీదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగ బాధల నుండి విముక్తి కలుగుతుంది.

కుంకుమ దానం వలన జీవితం లో ఉన్నత స్థాయి కి చేరడానికిభర్త కి దీర్ఘాయువు కలుగుతాయి

చందన దానం వలన తరచూ ఆక్సిడెంట్  కి గురికారు

తాంబూలం  దానం వలన అధిపతి అవుతారని శాస్త్ర వచనం.

నారికేళం దానం వలన ఏడు తరాల పితృదేవతలు నరకబాధల నుండి విముక్తి పొందుతారు

మజ్జిగ దానం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది.

పాదరక్షలు దానం వలన నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది.

గొడుగు దానం వలన కష్టాల నుండి విముక్తి లభిస్తుందివారికి మృత్యు బాధ ఉండదని చెప్పబడింది సమస్త దోషాలు నివారణ అవుతాయి.

పండ్ల దానం వలన జీవితం లో ఉన్నత స్థాయి కి చేరుతారు.

బియ్యం దానం వలన అపమృత్యు దోషాలు తొలగుతాయిఅన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం లభిస్తుంది.

ఆవు నెయ్యి దానం వలన అశ్వమేథ యాగం చేసిన పుణ్యం లభిస్తుందివిష్ణు సాయుజ్యం లభిస్తుంది

పితృ దేవతలకు తర్పణాలు వదిలిన వారికి దారిద్య్ర  బాధ ఉండదు.

అన్న దానం విశేష ఫలితాన్నిస్తుందివెంటనే తృప్తి ని ఇచ్చే దాన్నలన్నింటి లో ఉత్తమమైనది అన్న దానంసమస్త దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయిఅన్ని ధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది .

పెరుగు అన్నం దానం వలన వారు చేసిన కర్మలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది.

Also Read