సూర్య గ్రహణం

25th December 2019 4:07am

సూర్య గ్రహణం

26.12.2019వ తేదీ మార్గశిర అమావాస్య, గురువారం నాడు పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తోంది. ఇది ఉదయం 8.10 గంటలకు ప్రారంభమవుతుంది. ప. 9.38 ని. లకు మధ్య కాలం, ప.11.20 గంటలకు మోక్షకాలం. ఇది కేతుగ్రస్త గ్రహణం. గ్రహణం మూలా నక్షత్రం, ధనురాశి లో సంభవిస్తుంది.

ధనుస్సుతో పాటు వృషభం, కన్య, మకర రాశుల వారి పై గ్రహణ ప్రభావం అధికంగా ఉండవచ్చు. వీరు గ్రహణం అనంతరం శివాలయంలో అభిషేకాలు నిర్వహించుకోవడంతో పాటు, రవి, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వృషభరాశి వారిపై ప్రభావం ఉండవచ్చు.

 

 

జ్యోతిషంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది . కారణం మానవుని పై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉండటం జీవితంలో కనబడుతుంది . సూర్య గ్రహణం ,భూమి పై కొంత భాగం పైనే పడుతుంది . కాని , చంద్రుని నీడ చిన్నది కావటం చేత సూర్య గ్రహణం ఏ స్ధానంలో నుండి అయినా కొంత సమయం లేదా కొన్ని నిముషాలు మాత్రమే కనబడుతుంది . సూర్యగ్రహణ గరిష్ట అవధి 7 గంటల 40 నిమిషాలు.  సూర్యగ్రహణం ఒక ఏడాదిలో కనీసం రెండు సార్లు , అత్యధికంగా ఐదుసార్లు సంభవించవచ్చు . సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటిన్నర సంవత్సర కాలంలో ఒక్కసారే సంభవిస్తుంది . పశుపక్షాదులు  సూర్యగ్రహణ సమయంలో నిద్రించే ప్రయత్నం చేస్తాయి , లేదా విలక్షణంగా ప్రవర్తిస్తాయి .

 సూర్యగ్రహణ సమయానికి నాలుగు జాముల ముందు నుండి భోజనం మానాలి. వృద్దులు , బాలురు , రోగులకు ఈ నియమం వర్తించదు . గ్రహణ సమయంలో ఆరాధ్యదైవానికి సంభవించిన జపాదులు చేయటం అనంత రెట్లు అధికఫలం కలిగిస్తుంది . గ్రహణ మోక్షకాలం తరవాత పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల అక్షయ పుణ్య ఫలం లభిస్తుంది . శాస్త్రానుసారం  గ్రహణ సమయంలో ఇచ్చిన దానం , చేసే జపం , తీర్ధస్నానం అనేకరెట్లు అధికఫలం కలిగిస్తాయి .

గ్రహణం సంభవించే అంశకు దగ్గరగా జాతకంలో గ్రహం ఏదైనా ఉంటే అతనిపై గ్రహణ దుష్ప్రభావం పడుతుంది ఆ గ్రహం ఏ భావానికి కారణమైతే ఆ భావం యొక్క ఫలం పై ఆ ప్రభావం ఉంటుంది.  జాతకంలోని భావం యొక్క అంశ లో గ్రహణం సంభవించినా ఆ భావఫలం  ప్రభావితమౌతుంది.

 గ్రహణ సమయం పుణ్య కాలమని పురాణాలు , ధర్మ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది . సూర్య గ్రహణం దర్శన యోగ్యం గా ఉంటే అదంతా పుణ్య కాలమే. ఇది స్పష్టం గా కనిపించక పోయినప్పటికీ, పంచాంగం ద్వారా లేదా శాస్త్రాల ద్వారా తెలుసుకొని గ్రహణ స్పర్శ మోక్ష కాలాలు తెలుసుకుని స్నానం చేయాలి. గ్రహణ స్నానాన్ని కట్టుకున్న వస్త్రాల తోనే చేయాలి.

గ్రహణ కాలం లో చేసే జపం, దానం, హోమం, మొదలయినవన్నీ అధిక ఫలితాలనిస్తాయి, కావున వీలైనంత వరకు ఆయా పుణ్య కార్యాలను  యథాశక్తి గా ఆచరించాలి.

గ్రహణం విడువగానే పుణ్య నదులు, సరోవరాలు, కాలువలు, బావులు, లేదా కనీసం ఇంట్లోనైనా స్నానం చేయడం వల్ల శారీరిక మానసిక మలినాలు తొలగి పోయి మంచి భావనలు కలుగుతాయి.

గ్రహణాన్ని ఎవరు కూడా నేరుగా కంటి తో చూడకూడదు. ఇంట్లో నిల్వ ఉంచి ఉపయోగించే ఆహార పదార్దాల పైన దర్భలు ఉంచాలి. అప్పుడు అవి పరిశుద్ద మవుతాయి.

ముఖ్యం గా గర్భిణి స్త్రీలు గ్రహణ కాలం లో బయటకు రాకూడదు, గ్రహణ సమయం లో వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం వల్ల గర్భస్త శిశువు మానసిక శారీరిక వైకల్యాలతో జన్మించే ప్రమాదం ఉంది. గ్రహణ సమయం లో ఇష్ట దైవానికి  సంబంధించిన స్తోత్రాలను లేదా నామ జపాన్ని చేయడం విశేష ఫలదాయకం. మిగిలిన వారు కూడా గ్రహణ సమయం లో వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు

 

 

 

Also Read