Weekly Horoscope

2nd June, 2019 to 8th June, 2019

Aquarius

కుంభం

పనుల్లో తొందరపాటు వద్దు.

మిత్రులతో లేనిపోని వివాదాలు, సమస్యలు ఎదురుకావచ్చు.

మాటల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కాంట్రాక్టులు చివరి క్షణంలో చేజారే సూచనలు.

ఎంతగా శ్రమపడినా ఫలితం కనిపించని పరిస్థితి.

ఇంటి నిర్మాణాలు కూడా నిలిచిపోయే సూచనలు.

ప్రత్యర్థులు కొత్త సమస్యలు సృష్టించే వీలుంది.

విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సాధించేందుకు మరింత శ్రమపడాలి.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థికంగా సొమ్ము సకాలంలో అందక ఇబ్బందిపడతారు.

షేర్లు, ఆస్తుల విక్రయాల వల్ల సమకూరాల్సిన సొమ్ము కూడా ఆలస్యమవుతుంది. నేర్పు, పొదుపుతో నెట్టుకురావలసిన పరిస్థితి.

మరో వైపు రుణ దాతలు  ఇదే సమయంగా భావించి ఒత్తిడులు పెంచుతారు.

కుటుంబంలో అందరితోనూ విభేదించడం వల్ల కుటుంబ సభ్యులు మీపై విమర్శలు చేస్తారు. అలాగే, కుటుంబ బాధ్యతలు మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తాయి. సంతానం నుంచి కూడా కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

కొన్ని వేడుకలు రద్దు చేసుకుంటారు.

ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు.వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాల పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి.

భాగస్వాములు సైతం మీపట్ల కొంత అపనమ్మకం వ్యక్తం చేసే వీలుంది, అటువంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు పాటించండి.

వచ్చిన లాభాలతోనే సరిపెట్టుకోవాలి.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మరింత సవాలుగా మారవచ్చు.

ఉన్నతాధికారులు మీపై ఒత్తిడులు పెంచుతారు.

బదిలీలకు సైతం సిద్ధపడాలి.

పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు ఫలించకపోవచ్చు.

అయితే అధైర్యం చెందకుండా ముందుకు సాగడం మంచిది.

మహిళలకు ఉత్సాహం తగ్గుతుంది. అలాగే, సోదరులతో వైరం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces