Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Aquarius

కుంభం

కొన్ని కార్యక్రమాలు అత్యంత నిదానంగా సాగుతాయి.

ఆలోచనలు కలిసిరాకున్నా దిగాలు చెందక ముందుకు సాగండి, కొంత ఉపశమనం లభిస్తుంది.

ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు.

విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు.

వ్యూహాలు అమలులో మీకు మీరే సాటిగా నిలుస్తారు.

ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది.

భూ వివాదాలు, చిరకాలంగా కోర్టులో నలుగుతున్న కేసులు కొలిక్కి వస్తాయి.

ప్రముఖులు పరిచయం కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

ఆర్థికంగా సొమ్ముకు లోటు ఉండదు. అయితే,ఖర్చులు అదుపు చేసుకుంటే మేలు.

షేర్లు, ఆస్తుల విక్రయాల వల్ల పెండింగ్‌లో పడిన డబ్బు కూడా అందే అవకాశాలున్నాయి.

కొన్ని కార్యక్రమాలకు విరివిగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

కుటుంబంలో మీపై మరింత ప్రేమానురాగాలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులు మీరంటే ఇష్టపడతారు.

మీ నిర్ణయాలు, అభిప్రాయాలను మన్నిస్తారు.

మొదటి సంతానం ఉద్యోగ యత్నాలు సానుకూలమై ఉత్సాహంతో గడుపుతారు.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాల లో భాగస్వాముల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు.

నూతన పెట్టుబడులు అందుతాయి. విస్తరణలో సమస్యలు తీరతాయి.

ఉద్యోగాల లో విధులు ప్రశాంతంగా సాగిస్తారు.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

అదనపు బాధ్యతలు మీదపడినా లెక్కచేయరు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన విజయాలు ఉంటాయి. విదేశీయానం.

మహిళలకు కుటుంబంలో వారి మాటే నెగ్గే అవకాశాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces