Weekly Horoscope

16th June, 2019 to 22nd June, 2019

Aquarius

కుంభం

ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.

అనుకోని సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి.

నూతన విద్యావకాశాలు దక్కుతాయి.

ప్రముఖుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.

వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం.

ఆర్థికంగా రావలసిన డబ్బు అందుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

మీరై రుణ దాతలై ఇతరులకు డబ్బు అందించే అవకాశాలు.

షేర్ల విక్రయాలు లాభించి వాటి ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.

సంతానం నుంచి ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.

వివాహాది వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమవుతారు.

ఆరోగ్యం కొంత మెరుగుదల కనిపిస్తుంది.

క్రమేపీ స్వస్థత చేకూరుతుంది.

వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.

అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

భాగస్వాములతో వివాదాలను పరిష్కరించుకుంటారు.

ఉద్యోగాలలో ఉన్నతస్థితిలోని వారు మీకు చేదోడుగా నిలుస్తారు.

కోరుకున్న బదిలీలు తథ్యం.

రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి.

విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces