Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Aquarius

కుంభం

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.

ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు.

ఆలోచనలు కలసి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆస్తి వివాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు.

సేవాకార్యక్రమాలు చేపడతారు.

పనులు చకచకా సాగి విజయాలు సాధిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సొమ్ముకు లోటు రాదు.

రుణ బాధలు తొలగుతాయి.

రెండుమూడు విధాలుగా ధన లాభాలు కలుగుతాయి.

ముఖ్యంగా ఆస్తుల విక్రయాలు మరింత లాభించి ధన ప్రాప్తి కలుగుతుంది.

కుటుంబంలో విశేష ఆదరణ పొందుతారు.

మీరంటే అంతా ఇష్టపడి మీమాటకు ఎదురుచెప్పరు.

సంతానం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యపరంగా కొన్ని రుగ్మతలు చికాకు పర్చినా ఎప్పటికప్పుడు ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి.

కొత్త భాగస్వాములు కూడా చేరి మరింత విస్తరిస్తారు.

ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థతతో పూర్తి చేస్తారు.

ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు.

కళాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని విజయాలు చేకూరుతాయి.

మహిళలకు భూలాభాలు కలుగుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces