Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Aquarius

కుంభం

ఈ వారం అన్ని విషయాలలోనూ ముందడుగు వేస్తారు.

మీ శక్తి సామర్థ్యాలు, ప్రతిభ వెలుగులోకి వస్తాయి.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు.

ఆస్తుల విషయంలో ఒప్పందాలు కుదురుతాయి.

విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు.

ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది.

నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

ఆర్థికం గా అనుకున్న ఆదాయం సమకూరుతుంది.

అవసరాలు తీరి ఊరట చెందుతారు.

రుణ భారాల నుంచి విముక్తి.

ఆస్తులు, షేర్ల విక్రయాలు వల్ల కూడా మరింత సొమ్ము అందుతుంది.

మీ హామీలు పొందిన వారు కూడా సకాలంలో చెల్లించి మీకు ఉపశమనం కలిగిస్తారు.

కుటుంబంలో మీ ప్రేమాభిమానాలు పొందేందుకు అందరూ యత్నిస్తారు.

క్షణం తీరికలేకుండా గడుపుతారు.

వ్యవహారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

సంతానం వివాహా యత్నాలు ముమ్మరం చేస్తారు.

సోదరీలతో ఆనందంగా గడుపుతారు.

దూరపు బంధువుల రాకతో మరింత సందడి వాతావరణం నెలకొంటుంది.

ఆరోగ్య విషయం లో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

వ్యాపారాలు...సకాలంలో పెట్టుబడులు అందుతాయి.

నూతన భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు.

లాభాలకు లోటు ఉండదు.

ఉద్యోగాల లో ఆశించిన మేరకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పై స్థాయి వారి నుంచి ప్రోత్సాహం అందుతుంది.

రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే.

మహిళలకు భూ, ధన లాభాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces