Weekly Horoscope

24th November, 2019 to 30th November, 2019

Aquarius

కుంభం

ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.

చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవర్తమానాలు.

కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.

శ్రమ పెరిగినా లెక్కచేయరు.

రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందినా అవసరాలు తీరతాయి.

రుణాలు చాలావరకూ తీరే సమయం.

షేర్లలోనూ, స్థిరాస్తుల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలం.

అయితే ఇతరులకు హామీల పై పునరాలోచన మంచిది.

కుటుంబంలో మొదట్లో మీపై కొంత వ్యతిరేకత వ్యక్తమైనా క్రమేపీ ఇష్టులుగా మారతారు.

వివాహాది వేడుకలతో కుటుంబం కళకళలాడుతుంది.

సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది.

స్వల్ప అనారోగ్యం, వైద్య సేవలు స్వీకరిస్తారు.

వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి.

విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

కొత్త భాగస్వాముల రాకతో కొత్త కళ సంతరించుకుంటాయి.

ఉద్యోగాలలో కోరుకున్న ప్రమోషన్లు దక్కవచ్చు.

అయితే పని భారం పెరుగుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces