Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Aquarius

కుంభం

వ్యయప్రయాసలు పడి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు.

స్నేహితులతో తరచూ విభేదాలు నెలకొంటాయి, మీ ఆలోచనలతో విభేదిస్తారు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

వివాహాది వేడుకల్లో పాల్గొంటారు.

ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కొంత సంతోషం కలిగిస్తాయి.

విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు.

ఇంటి నిర్మాణం, కొనుగోలులో అవాంతరాలు.

ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

అవసరాలు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది.

ఇతరుల రుణ భారాలు సైతం మీపై పడవచ్చు.

హామీల విషయంలో తొందరపడకండి.

కుటుంబంలో సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొంటాయి.

కొన్ని వేడుకల నిర్వహణలో అవాంతరాలు.

మీ అభిప్రాయాలు, నిర్ణయాలపై కుటుంబ సభ్యులు ఆసక్తి చూపరు.

ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి.

తరచూ ఏదో ఒక రుగ్మతతో బాధపడతారు.

వ్యాపారాలలో ఊహించిన లాభాలు దక్కించుకునేందుకు కష్టపడాల్సిన పరిస్థితి. పెట్టుబడులకు తొందరవద్దు.

భాగస్వాములతో వివాదాలు.

ఉద్యోగాలలో కొన్ని మార్పులు తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది.

పై స్థాయి వారి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొంతలో కొంత అనుకూలం.

మహిళలకు గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces