పంచాంగం..ఆదివారం, 24.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి శు.చవితి ఉ.11.38 వరకు తదుపరి పంచమి నక్షత్రం విశాఖ తె.4.32 వరకు(తెల్లవారితే సోమవారం) తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.8.37 నుంచి 10.23 వరకు దుర్ముహూర్తం సా.4.17 నుంచి 5.06 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Aries

మేషం

అనుకున్నదే తడవుగా పనులు చేపట్టి పూర్తి చేస్తారు.

మీ ఆభిప్రాయాలు పదిమందినీ ఆకట్టుకుంటాయి.

మహానుభావులు, ప్రముఖులతో సమావేశమవుతారు.

కొన్ని త్యాగాలకు సిద్ధపడి మీ మంచితనాన్ని చాటుకుంటారు.

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి.

ఎదుటవారి విశ్వాసాలను గౌరవించడం ద్వారా పెద్ద మనసు చాటుకుంటారు.

వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.

విద్యార్థులు కొత్త అవకాశాలు అంది పుచ్చుకుంటారు.

వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు.

పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారు పట్టింది బంగారమే కాగలదు.

కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అశ్వని వారికి ఆదివారం ధన లబ్ధి, కుటుంబ సౌఖ్యం. గురువారం అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.

భరణి వారికి మంగళవారం కార్య జయం. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. శుక్రవారం అనారోగ్యం. కుటుంబంలో గందరగోళం.

కృత్తిక 1వ పాదం వారికి సోమవారం శుభవార్తలు. వస్తు లాభాలు. బుధవారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

చంద్ర గ్రహ స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces