Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Aries

మేషం

అనుకున్న కార్యాలు కొంత జాప్యంతో పూర్తి కాగలవు.

ఆప్తుల నుంచి మాట పడాల్సివస్తుంది

మీ నిర్ణయాలపై పునఃసమీక్ష చేసుకుంటారు.

ఒక సమాచారం నిరాశ పరుస్తుంది.

నిరుద్యోగులు, విద్యార్థులకు అంచనాలు తారుమారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు.

ఆర్థికంగా ఇతరుల సహాయం లేకుండా ముందుకు సాగాలనుకున్న మీ యత్నాలు నెరవేరవు.

అప్పులు కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి. కొంత సొమ్ము వృథా కాగలదు.

మీ ప్రయత్నాలను కుటుంబ సభ్యులు నిరుత్సాహపరుస్తారు.

మీ మాట అంతగా పట్టించుకోకపోవడంతో కలత చెందుతారు.

మౌనం అన్ని విధాలా శ్రేయస్కరం అని గుర్తిస్తారు.

సోదరులు, సోదరీలతో వైరం.

ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహించండి. తరచూ జలుబు వంటి రుగ్మతలతో బాధపడతారు.

వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయే తప్ప చేతికందవు.

అలాగే, పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది.

విస్తరణ యత్నాలు వాయిదా వేయండి.

ఉద్యోగ వి«ధుల్లో  అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి.

శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది.

అతి విశ్వాసం పనికిరాదు.

రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం

లక్ష్మీ గణపతి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces