Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Aries

మేషం

ఈవారం విశేషమైనదిగానే చెప్పవచ్చు.

మీ శక్తియుక్తులు, సామర్థ్యం చాటుకుంటారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

భవిష్యత్‌ అంచనాలు రూపొందిస్తారు.

కొన్ని వివాదాలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు.

ప్రముఖులతో చర్చలు జరుపుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

సొమ్ము చేతికందే అవకాశాలున్నాయి.

రుణదాతల ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు.

కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

సోదరులు మీకు విశేషంగా సహకరిస్తారు.

శుభకార్యాల పై దృష్టి సారిస్తారు.

సంతానపరంగా విశేష లాభదాయకంగా ఉంటుంది.

భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

ఆరోగ్య సంరక్షణలో మీ జాగ్రత్తలు ఫలిస్తాయి.

ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాములతో తగాదాలు తీరతాయి.

ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందుతుంది.

పై స్థాయి అధికారుల సహాయం అందుతుంది.

పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితులు.

మహిళలకు శుభవార్తలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces