Weekly Horoscope
2nd December, 2018 to 8th December, 2018
Aries
మేషం
పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. కార్యజయం.
అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు.
తీర్థయాత్రలు చేస్తారు.
కొన్ని వ్యవహారాలలో రాజీపడి అనుకూల ఫలితాలు సాధిస్తారు.
మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు.
నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.
వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు మరింత కలసి వస్తాయి.
సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
ఎంతోకాలంగా పెండింగ్ పడ్డ బాకీలు సైతం వసూలవుతాయి.
దీర్ఘకాలిక రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది.
మొత్తం మీద డబ్బుకు లోటులేకుండా గడుస్తుంది.
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.
మీ సమర్థతను చాటుకుని అందర్నీ ఆకట్టుకుంటారు.
సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
బంధువుల నుంచి కీలక సమాచారం రాగలదు.
సంతానపరంగా సమస్యలు తీరతాయి.
ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
కొన్ని రుగ్మతలు తీరతాయి.
మొత్తం మీద ఈవారం ఆరోగ్యపరమైన వాతావరణంలో గడుపుతారు.
వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి.
పై స్థాయి వారి నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తుంది.
ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
కళాకారులు అవకాశాలు మరిన్ని దక్కించుకుంటారు.
మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.