Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Aries

మేషం

ఎంతటి పని చేపట్టినా విజయవంతమే.

ఆలోచనలు మరింత కలిసి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

మీ నిర్ణయాలు అందరికీ శిరోధార్యంగా ఉంటాయి.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.

కాంట్రాక్టులు, టెండర్లు దక్కించుకుంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

అనూహ్యంగా సొమ్ము అందుతుంది.

వివిధ రూపాల్లో సొమ్ము అందుకుంటారు.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు.

కుటుంబంలో మీ పై ప్రేమాభిమానాలు చూపే వారు పెరుగుతారు.

సోదరులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు సర్దుబాటు కాగలవు.

సంతానపరంగా కూడా కొన్ని సమస్యలు తీరతాయి.

వ్యాపారాలలో కోరుకున్న లాభాల దిశగా సాగుతారు.

నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలలో మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసి ముందడుగు వేస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత సానుకూలమైన సమయం.

విద్యార్థుల యత్నాలు సఫలం.

మహిళలకు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.  

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces