Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Aries

మేషం

అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి.

ఆప్తుల నుంచి కీలక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

ఆస్తుల వివాదాల నుంచి కొంతమేరకు గట్టెక్కుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది.

శత్రువులు కూడా మిత్రులుగా మారవచ్చు.

సొమ్ముకు లోటు ఉండదు. అయితే బ్యాంకు రుణాల ఒత్తిడులు పెరుగుతాయి.

షేర్ల క్రయవిక్రయాలతో కొంత డబ్బు చేకూరుతుంది.

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

నేర్పుతో వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.

సంతాన వివాహ విషయం కొలిక్కి వస్తుంది.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వ్యాపారాలలో కోరుకున్న లాభాలు అందుతాయి.

పెట్టుబడులు సైతం సమకూరతాయి.

ఉద్యోగస్తులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉన్నతమైన పోస్టులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces