Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Aries

మేషం

నూతనోత్సాహంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు.

ఇతరులకు సైతం సాయపడి మన్ననలు పొందుతారు.

మీ ఆలోచనలు అమలులో పెడతారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

తీర్థ యాత్రలు సాగిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు.

కాంట్రాక్టర్లు అనుకున్న పనులు కైవసం చేసుకుంటారు.

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

ఇంత కాలం పడిన ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది.

ఇబ్బడిముబ్బడిగా చేసిన రుణాలు చాలావరకూ తీరుస్తారు.

ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వచ్చి కొంత ధన ప్రాప్తి కలుగుతుంది.

అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.

మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబ సభ్యుల పాత్ర పెరుగుతుంది.

సంతానం నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

వివాహాది శుభ కార్యాలకు సంసిద్ధులవుతారు.

కొద్ది పాటి నలత చేసినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

పెట్టుబడులు సమకూరి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

అనుకున్న హోదాలు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు.

మహిళల ఆశయాలు నెరవేరతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces