Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Aries

మేషం

పనులు చకచకా పూర్తి చేసి ఉత్సాహంతో ఉంటారు.

ఆలోచనలు అమలులో ముందుంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పలుకుబడి పెరుగుతుంది.

మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది.

ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు.

అందరికీ ఆదర్శవంతులుగా నిలిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు.

ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి.

సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగి ఊరట చెందుతారు.

అయితే ఇతరులకు హామీలిచ్చే సందర్భంలో నిదానం అవసరం.

మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల సహాయం ఉంటుంది.

మీరంటే మరింత ఇష్టపడతారు.

వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు.

సోదరులు, సోదరీలతో కుటుంబ విషయాలపై చర్చిస్తారు.

ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు.

వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత నెలకొని పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు.

ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు దక్కుతాయి.

పై స్థాయి వారి ప్రోత్సాహంతో దూసుకుపోతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలు పెద్దల సలహాలు పాటించి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శ్రీ శివప్రాతః స్మరణ స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces