Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Aries

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.

ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి అనుకూల సమాచారం అందుతుంది.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం.

చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

యుక్తితో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ఆర్థికంగా రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

రుణ బాధలు చాలావరకూ తగ్గుతాయి.

షేర్ల విక్రయాలు లాభించి కొంత సొమ్ము సమకూరుతుంది.

కుటుంబంలో మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వివాహాది శుభకార్యాల పై చర్చలు జరుపుతారు.

బంధువులతో వివాదాలు తీరతాయి.

సంతాన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

విస్తరణలోనూ ఆటంకాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

ఉన్నతాధికారుల నుంచి సహాయం అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల సమయం.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces