Weekly Horoscope
1st December, 2019 to 7th December, 2019
Aries
మేషం
అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.
చిన్ననాటి స్నేహితులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు.
ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు.
నిర్ణయాలలో కొంత జాప్యం.
ఆలోచనలు అంతగా కలసిరావు.
సమాజ సేవలో భాగస్వాములవుతారు.
పలుకుబడి పెరుగుతుంది.
ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం.
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.
ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.
షేర్లలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడతారు.
కుటుంబం లో అందరి మనస్సులను ఆకట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చు చేస్తారు.
సోదరులతో విభేదాలు తొలగుతాయి.
ఆస్తుల పంపకాలు సాఫీగా సాగుతాయి.
ఆరోగ్యం కొంత నలత తప్పకపోవచ్చు.
వ్యాపారాలలో ఆశించిన మేరకు లాభాలు, పెట్టుబడులు అందుతాయి.
విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు.
ఉద్యోగాలలో ఊహించని బదిలీలు ఉండవచ్చు.
అయితే అన్నీ మన మంచికే అన్నట్లుగా ఉంటాయి.
పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.
హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.