Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Aries

మేషం

కొత్త కార్యక్రమాలు త్వరితగతిన చేçపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి ఊహించని సమాచారం అందుతుంది.

స్థిరాస్తి వివాదాల నుంచి కొంతమేరకు గట్టెక్కుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది.

ఆకస్మికంగా ధన లాభాలు కలిగి రుణ విముక్తి లభిస్తుంది.

స్థిరాస్తి విక్రయాలు లాభసాటిగా ఉండి కొంత సొమ్ము అందుతుంది. అలాగే, రుణ బాధలు తొలగుతాయి.

కుటుంబంలో అందరితోనూ ఉత్సాహవంతంగా గడుపుతారు.

బంధువులతో సత్సబంధాలు నెలకొంటాయి.

సోదరులు, సోదరీల నుంచి ఆశించిన సహాయం అందుతుంది.

స్వల్ప అనారోగ్యం, వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అంది విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి.

ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి.

విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

మహిళలకు మరింత ప్రశాంతత చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ పంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces