Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Aries

మేషం

మీ ఆలోచనల అమలులో ఆటంకాలు తొలగుతాయి.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

పలుకుబడి మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.

ఇతరులకు సైతం సాయం అందించి దాతృత్వాన్ని చాటుకుంటారు.

ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి.

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

ఆనుకున్న ఆదాయం సమకూర్చుకుని అవసరాలు తీర్చుకుంటారు.

అలాగే, రుణాలు తీరి ఊరట చెందుతారు.

షేర్లలోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం.

మీ ప్రయత్నాలు, కృషికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు.

వివాహాది వేడుకల నిర్వహణలో ముందడుగు వేస్తారు.

ఆస్తుల పై తండ్రి తరఫువారితో వివాదాలు తీరతాయి.

ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు.

వ్యాపారాలు క్రమేపీ ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఆశించిన లాభాలు దక్కుతాయి.

పెట్టుబడులు రెట్టింపు చేస్తారు.

ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు సంభవం.

ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల వాతావరణం.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces