Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Aries

మేషం

పట్టింది బంగారమే.

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీ ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది.

చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

ఆర్థికంగా సొమ్ములకు లోటులేని విధంగా గడిచిపోతుంది.

రుణ బాధలు సైతం తీరతాయి.

షేర్లలోనూ పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది.

సోదరులతో ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

స్వల్ప అనారోగ్యం, ఔషధ సేవనం.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.

ఉద్యోగాలలో కొందరికి పనిభారం తగ్గుతుంది.

ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

రాజకీయవర్గాలవారికి సన్మానాలు, ప్రజాదరణతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

మహిళలకు కుటుంబ సభ్యుల చేయూతతో కొన్ని విజయాలు సాధిస్తారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces