Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Aries

మేషం

ఈతి బాధలు, అవస్థల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

ఇంత కాలం ఎదుర్కొన్న కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి.

ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా బేరీజు వేసుకుని ముందుకు సాగుతూ వ్యవహారాలు చక్కదిద్దుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి.

ఆర్థికంగా కొంత వెలుసుబాటు కలుగుతుంది.

రావలసిన డబ్బు కొంత లో కొంత అందే అవకాశాలున్నాయి.

అయితే పూర్తి సంతృప్తి కలగదు.

కుటుంబంలో అందరితోనూ ప్రేమగా మసలుకుంటారు.

ఆప్యాయత, అనురాగాలు చూపుతారు.

వివాహాది వేడుకలు కొన్ని రద్దు చేసుకునే అవకాశాలున్నాయి.

ప్రత్యేకించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది.

కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలు అనుకున్న విధంగా లాభాలు పొందేందుకు కష్టపడి ఫలితం సాధిస్తారు.

విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు.

ఉద్యోగస్తుల విధుల్లో ప్రతిబంధకాలు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

ముఖ్యంగా ఇష్టంలేని మార్పులు బాధిస్తాయి.

పారిశ్రామికవర్గాలు, కళాకారులకు అంచనాలు కొంత ఫలిస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces