Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Cancer

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

నిరుద్యోగులకు ఆశలు ఫలించవు.

యత్నాలలో విఘాతాలు.కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి.

మిత్రులే శత్రువులుగా మారతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది.

బ్యాంకు రుణాల కోసం యత్నిస్తారు.

ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కుటుంబంలో కొన్ని సమస్యలతో డీలాపడతారు.

మీ మాటలు సోదరులను నొప్పించవచ్చు, జాగ్రత్త అవసరం.

సంతాన విషయంలో తీసుకునే నిర్ణయాలు అంతగా కలసిరావు.

భార్యాభర్తల మధ్య కొద్దిపాటి విభేదాలు తప్పవు.

కొన్నిరుగ్మతలు బాధిస్తాయి. ఆస్పతుల సందర్శనం.

వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు ఉంటాయి.

పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.

ఉద్యోగాలలో మార్పులకు అవకాశం ఉంది. విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.

మహిళలకు మానసిక సంఘర్షణ.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces