Weekly Horoscope

16th September, 2018 to 22nd September, 2018

Cancer

కర్కాటకం

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

భూవివాదాలు పరిష్కారమవుతాయి.

పట్టుదల, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు.వాహనయోగం.

ప్రముఖులు పరిచయం కాగలరు.

కాంట్రాక్టర్లకు విశేషంగా కలిసివస్తుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందడం విశేషం. దీర్ఘకాల రుణబాధల నుంచి విముక్తి.

సోదరుల నుంచి ధనలాభం కలుగుతుంది.

కుటుంబంలో మీ ప్రతిపాదనలు, సూచనలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. అందరి ఆదరణ పొందుతారు.

దూరమైన ఒక వ్యక్తి  తిరిగి దగ్గరకు చేరడం ఊరట కలిగిస్తుంది.

భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.

సంతానంతో ఉత్సాహంగా గడుపుతారు.

బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.

క్రమేపీ స్వస్థత చేకూరి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు.

భాగస్వాములు పెరుగుతారు.

విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.

ఆశించిన లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉన్నత పోస్టులు రావచ్చు.  మంచి గుర్తింపు రాగలదు.

రాజకీయవేత్తలకు పదవులు, హోదాలు దక్కుతాయి.

మహిళలకు సంతోషకరమైన సమాచారం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces