Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Cancer

కర్కాటకం

అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు.

ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

విద్యావకాశాలతో విద్యార్థులు ఉత్సాహంగా సాగుతారు.

ఇంటి నిర్మాణాల పై దృష్టి సారిస్తారు.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

మిత్రులు మీపట్ల మరింత ఆదరణ చూపుతారు.

రహస్య విషయాలు తెలుసుకుంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

కొంత సొమ్ము అనూహ్యంగా దక్కుతుంది.

షేర్ల విక్రయాలలోనూ ఆశించిన సొమ్ము అందుకుంటారు.

రావలసిన బాకీలు అందుతాయి.

కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

శుభకార్యాల సందడితో హడావిడిగా గడుపుతారు.

ఆస్తుల పంపకాల పై సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.

ఆరోగ్యంపరంగా కొద్దిపాటి రుగ్మతలు నెలకొన్నా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి.

భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు.

ఉద్యోగాల విధి నిర్వహణలో ప్రశంసలు పొందుతారు. అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు.

రాజకీయవేత్తలు పదవులను పొందుతారు. సత్కారాలు జరుగుతాయి.

మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces