Weekly Horoscope

7th July, 2019 to 13th July, 2019

Cancer

కర్కాటకం

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు.

అందరిలోనూ అనుకున్నంత గౌరవం లభించక డీలాపడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.

వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.

కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు.

అనుకున్న ఆదాయం సమకూరక అప్పులు చేస్తారు.

కొంత సొమ్ము చేజారే వీలుంది, అప్రమత్తంగా ఉండండి.

ఆస్తులు విక్రయించినా సకాలంలో డబ్బు చేతికందదు.

కుటుంబంలో మీరు ఎంతగా ఆదరణ చూపినా కుటుంబ సభ్యులు మీపై నెపాలు వేస్తునే ఉంటారు.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు నెలకొంటాయి.

మీ నిర్ణయాలపై వ్యతిరేకత.

మొత్తం మీద మౌనం వహిస్తూ ఆచితూచి వ్యవహరించడం మంచిది.

వ్యాపారాల లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి.

ఉద్యోగాల విధి నిర్వహణలో శ్రమ మరింత పెరుగుతుంది.

రాజకీయవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces