Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Cancer

కర్కాటకం

కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది.

ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంతో సాగుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

అనూహ్యంగా సొమ్ము అందుతుంది.

అప్పులు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

ఇతరులకు సైతం చేతనైన సహాయం అందిస్తారు.

ఒక వ్యక్తి ద్వారా అందాల్సిన సొమ్ము సైతం అందుతుంది.

కుటుంబంలో అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు.

సంతానపరంగా మరింత సౌఖ్యం. వారి వివాహ యత్నాలు కలసివస్తాయి.

దగ్గరి బంధువుల సహాయం అందుతుంది.

పుట్టినరోజు వంటి వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది.

నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గడుస్తుంది.

వ్యాపారాలలో మరిన్ని లాభాలు గడిస్తారు.

నూతన పెట్టుబడులు అందుతాయి.

భాగస్వాములు మీపై మరింత నమ్మకం ఉంచుతారు.

ఉద్యోగాలలో ఆశించిన విధంగా పదోన్నతులు రాగలవు.

పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

రాజకీయవేత్తలు, పరిశోధకులకు విశేష ఆదరణ లభిస్తుంది.

మహిళలకు పురస్కారాలు అందుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces